పోలవరం ప్రాజెక్ట్ ను 2021 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది… పోలవరం నిర్మాణంపై రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది…
ప్రాజెక్ట్ ను 2019 నాటికి పూర్తి చేయాలి అన్న గడువును 2021 నాటికి సవరించాలని పేర్కొంది… ప్రాజెక్ట్ లో వివిధ భాగాల కాంట్రాక్ట్ నిర్వాహణ కారణాలతో గడువు పొడగించారని చెప్పింది… 2018, 2019లో ప్రాజెక్ట్ కోసం 3 వేల 47 కోట్లు ఖర్చు చేశారని అందులో కేంద్రం 14 వందల ఇచ్చిందని తెలిపింది…
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రతిపాదనల మేరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 8 వేల 614 కోట్లు విడుల చేసిందని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల గురించి ఆడిట్ జరుగకుండా నిధులు విడుదల చేసేది లేదని ఆర్థిక శాఖ గతంలో చెప్పినట్లు తాజాగా తెలిపింది…