మనం పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.. మన దేశంలో ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. ఉద్యోగం వ్యాపారం చేసే వారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, కచ్చితంగా మీకు పాన్ కార్డు ఉండాల్సిందే, దీనిని ఆదాయపు పన్నుశాఖ వారు అప్లై చేసుకున్న పదిహేను రోజుల లోపు జారీ చేసేవారు.
ఇప్పుడు పాన్ కార్డు అప్లై చేసుకునేవారు చాలా మంది పెరిగారు, దీంతో నిత్యం వేలాది పాన్ కార్డులు మంజూరు అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు, ఆధార్ కార్డుల ఇంటర్చేంజబుల్ను అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అంటే పాన్ కార్డు లేకపోతే దాని స్థానంలో ఆధార్ కార్డు ఉపయోగించొచ్చు. ఈ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం, ఇక మీరు పాన్ కార్డు కావాలి అంటే వెంటనే ఆన్ లైన్ లో పొందవచ్చు, దీనికోసం ఆన్ లైన్ పోర్టల్ ఉంటుంది,అందులో మీరు ఆధార్ డీటెయిల్స్ ఇస్తే మీకు రెండు నిమిషాల్లో పాన్ నెంబర్ వస్తుంది.
దీంతో అదే ప్రూఫ్ గా మీరు అన్నింటికి వాడుకోవచ్చు .. గతంలో వారం రెండు వారాలు పట్టే పాన్ కార్డ్ జారీ ఇప్పుడు కేవలం నిమిషాల్లో అందించాలి అని కేంద్రం భావిస్తోంది .. ఈనెలలోనే దీనిని కేంద్రం ప్రారంభించనుంది, కేవలం మీరుఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుంది మీకు ఆన్ లైన్ లో పాన్ కార్డ్ వస్తుంది.