కేంద్రం గుడ్ న్యూస్ మీ సొంతూళ్ల‌కు వెళ్లండి కాని కండిష‌న్స్ ఇవే

కేంద్రం గుడ్ న్యూస్ మీ సొంతూళ్ల‌కు వెళ్లండి కాని కండిష‌న్స్ ఇవే

0
92

లాక్ డౌన్ వేళ ఎక్క‌డి వారు అక్క‌డే ఉండిపోయారు, దీంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.. టూరిస్టులు అలాగే విద్యార్దులు వ‌ల‌స కార్మికులు.. ఈ స‌మ‌యంలో దాదాపు 40 రోజులుగా ఎక్క‌డి వారు అక్క‌డే చిక్కుకున్నారు, ఈ స‌మ‌యంలో వారికి ఉపాధి లేదు, ఇప్ప‌టికే త‌మ‌ని సొంత గ్రామాలకు పంపాలి అని అక్క‌డ ప్ర‌భుత్వాల‌ని కోరుతున్న వారు చాలా మంది ఉన్నారు.

ఈ స‌మ‌యంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వలస కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల చిక్కుకున్న పర్యాటకులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్నీ స్టేట్స్ కు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు లేఖ‌లు రాసింది కేంద్రం… ఇందుకోసం ప్రతి రాష్ట్రం నోడల్ అధికారులను నియమించాలి.

ఇక ఎవ‌రు ఎక్క‌డ నుంచి ఎక్క‌డికి వెళుతున్నారు.. పూర్తీ డీటెయిల్స్ తెలుసుకోవాలి, వారికి టెస్ట్ చేసిన త‌ర్వాత మాత్ర‌మే పంపాలి, సొంత గ్రామాల‌కు వెళ్లిన త‌ర్వాత వారికి మ‌రోసారి టెస్ట్ చేయాలి అప్పుడు కూడా 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలి అని తెలిపింది కేంద్రం. ఈ విష‌యంలో రాష్ట్రాల పరస్పరం సంప్రదింపులు జరుపుకోవాలి. పరస్పర ఒప్పందంతో రోడ్డు మార్గంలో వారిని తరలించాలి.