వైసీపీకి మార్చిలో గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం

వైసీపీకి మార్చిలో గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం

0
83

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఢిల్లీ టూర్ ఫలించింది అంటున్నారు కొందరు నేతలు.. అవును హస్తిన వేధికగా ఇదే చర్చ జరుగుతోంది.. ఏపీలో పలు సంక్షేమ పథకాలు బాగున్నాయి అని ముఖ్యమంత్రి జగన్ కు ప్రశంసలు వచ్చాయట, అయితే శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిధిలో ఉంది.. అందుకే జగన్ ప్రధాని మోదీ అమిత్ షా అలాగే న్యాయశాఖ మంత్రితో సంప్రదింపులు జరిపారు.

వారు చెప్పిన దాని ప్రకారం జగన్ కు హామీ వచ్చింది అని తెలుస్తోంది.. మార్చి 30 లోపు మండలి రద్దు పై ప్రకటన వస్తుంది అని తెలిపారట, అయితే దీనిపై వైసీపీ నేతలు ధీమాగానే ఉన్నారు, పూర్తి వివరాలు పార్టీ నేతలు చెప్పకపోయినా సీఎం జగన్ టూర్ సక్సెస్ అయింది అంటున్నారు.

ఇక కేంద్రంలో ఎన్డీయేలో చేరే విషయం పై కూడా చర్చ జరిగింది అని, ఏపీలో పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకుని రాజకీయ పరిస్దితుల ప్రకారం జగన్ బీజేపీ ఎన్డీయేతో కలిసే అవకాశం ఉందట, మొత్తానికి మార్చిలో మండలి రద్దు వార్త ఇప్పుడు ఏపీలో వైరల్ అవుతోంది.