రెండో రాజధానిగా హైదరాబాద్ వార్త పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

రెండో రాజధానిగా హైదరాబాద్ వార్త పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
95

దేశంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది న‌రేంద్ర‌మోదీ స‌ర్కారు, తాజాగా ఆయన మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది .. మన హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అవ్వబోతుంది అనే వార్తలు గత రెండు నెలలుగా వినిపిస్తున్నాయి. కేంద్రం అడుగులు అలా ఉండబోతున్నాయని ఏదైనా జరగవచ్చు అనుకున్నారు.. ఈ సమయంలో ఉద్యమం నుంచి పైకి వచ్చిన పార్టీ తెరాస, మరి హైదరాబాద్ పై కెసిఆర్ ఆశలు వదులుకుంటారా అంటే ఇది జరిగేది కాదు అని టీఆర్ ఎస్ కూడా భావించింది.

ఈ విషయంలో కేంద్రం ముందుకు అడుగులేస్తుందా అనే అనుమానం మీకు వస్తుందా… హైదరాబాద్ రెండవ రాజధాని అంశంపై కేబినెట్ నిజంగా ఆలోచన చేసిందా అంటే ఇదంతా వాస్తవం కాదు అని తెలుస్తోంది.. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై భేటీ జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ ని దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన కేంద్రం దగ్గర లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే.