బంగారం కొనేవారికి కేంద్రం షాక్..!

0
95

బంగారం కొనుగోలుదారులకు కేంద్రం షాకిచ్చింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 5శాతం పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఒక్కరోజులోనే దాదాపు  రూ.1310 పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.52,200కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.