దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీపావళి వేళ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాహనదారులకు కాస్త ఊరట కలిగించే అంశం. తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి.
అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వినియోగదారులకు నేరుగా వర్తించదని నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు అనేది కంపెనీలకు లాభదాయకం అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మేరకు.. కంపెనీలు రేట్లు తగ్గిస్తే ఆ ప్రయోజనం కస్టమర్లుకు అందుతుందని పేర్కొంటున్నారు.