ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు, వైసీపీ పార్టీ ఎన్టీయేలో చేరబోతున్నారా అనేది చర్చించుకుంటున్నారు, దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిశారు సీఎం జగన్మోహన్ రెడ్డి, అయితే ఈ సమయంలో ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిపారు, ఆయనని ఆహ్వానించారు.
అయితే తాజాగా ఆయన కూడా ఎన్డీయేలో చేరాలి అని చెప్పారట, దీనిపై జగన్ కూడా చర్చించుకోవాలి అని చూస్తున్నారు, అయితే ఈ విషయం పై అమిత్ షాతో చర్చించి ముందుకు వెళ్లాలి అని చెప్పారట, మరి దీనిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది పెద్ద సంచలనంగా మారింది.
ఎన్నికల్లో గెలిచిన సమయం నుంచి బీజేపీతో సయోధ్యగానే ఉంటున్నారు జగన్ … ముందు నుంచి తమతో కలిసి నడవాలి అని కోరింది బీజేపీ.. అలాగే ప్రతీ విషయంలో బీజేపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు సీఎం జగన్ … ఈ సమయంలో ఆయన ఎన్డీయేలో చేరడం ఇక లాంఛనమే అంటున్నారు కొందరు విశ్లేషకులు.