కేంద్రం సంచలన నిర్ణయం.. రెండు చానెళ్లపై నిషేధం

కేంద్రం సంచలన నిర్ణయం.. రెండు చానెళ్లపై నిషేధం

0
88

దేశంలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి తెలిసిందే, వెంటనే సర్కారు కూడా అలర్ట్ అయింది, పరిస్దితి సాధారణ స్దితికి తీసుకువచ్చింది, అయితే అల్లర్లపై నిబంధనలకు విరుద్దంగా ప్రసారాలు నిర్వహించాయి కొన్ని ఛానల్స్, అందుకే వాటిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

రెండు మలయాళ చానళ్లపై 48 గంటల నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిషేధానికి గురైన వాటిలో ఏషియా నెట్, మీడియా వన్ మళయాళ చానెళ్లు ఉన్నాయి. ఈ రెండు చానళ్లు రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా రిపోర్టింగ్ చేశాయని ఆశాఖ తెలిపింది.

అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు, దేశంలో ఇలాంటి పరిస్దితి ఉన్న సమయంలో ఇలాంటి ప్రసారాలు చేస్తారా అని ప్రశ్నించారు.శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై కొందరు జర్నలిస్టులు తప్పు పడుతున్నారు.