రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాల కోసం రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు ఇవి పూర్తిగా వడ్డీ లేకుండా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామని ఈ ప్రత్యేక నిధి ద్వారా అన్ని రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందుతాయని తెలిపారు.