చంద్రబాబుకి బిగ్ షాక్ వైసీపీలోకి 16 మంది ఎమ్మెల్యేలు

చంద్రబాబుకి బిగ్ షాక్ వైసీపీలోకి 16 మంది ఎమ్మెల్యేలు

0
90

తెలుగుదేశం పార్టీకి దారుణమైన ఓటమి ఈ ఎన్నికల్లో వచ్చింది.. దీంతో తెలుగుదేశం పార్టీ గత అనుభవాలు చూసుకున్నా, ఎక్కడా ఎప్పుడు రాని ఫలితాలు పొందింది. బహుశా టీడీపీ ఆవిర్భావం నుంచి ఇంత దారుణమై పరాభవం ఇదే అని చెప్పాలి. అయితే వైసీపీ గెలుపుతో చాలా మంది టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ పంచన చేరుతున్నారు.

తాజాగా వైసీపీలోకి చేరేందుకు వల్లభనేని వంశీ కూడా రంగం సిద్దం చేసుకుంటున్నారు .ఈ సమయంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి చేసిన కామెంట్లు ఏపి పొలిటికల్ కారిడార్లో కాక రేపుతున్నాయి.ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. దీంతో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.

అయితే వంశీ రాజీనామాతో 22 మంది మాత్రమే టీడీపీలో ఉన్నారు. దీంతో 16 మంది ఎవరు పార్టీ మారేందుకు వైసీపీతో చర్చలు జరుపుతున్నారు అనే చర్చ టీడీపీలో జరుగుతోంది. తెరవెనుక ప్రయత్నాలు టీడీపీ నేతలు చేస్తున్నారా అనే అనుమానం మరింత బలంగా మారింది.. మొత్తానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఏమైనా స్కెచ్ వేసిందా అనే చర్చ నడుస్తోంది.