చైనా దూకుడుకు బ్రేక్…. భారత్ బాటలోనే అమెరికా….

చైనా దూకుడుకు బ్రేక్.... భారత్ బాటలోనే అమెరికా....

0
138

గాల్వాన్ లోయ వద్ద చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అదేశానికి సంబంధించిన సుమారు 59 యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేదం విధించింది…. జాతీయ భద్రత, దేశ సమగ్రత వంటి అంశాలకుభంగం వాటిల్లుతుందనే నేపధ్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది…

అయితే ఇదే క్రమంలో చైనాకు బుద్ది చెప్పేందుకు అగ్రరాజ్యం అయిన అమెరికా కూడా అదే బాటలో వెళ్తోంది… చైనీస్ యాప్స్ ను నిషేదించే అంశాన్ని పరిశీలిస్తోంది… అమెరికా విదేశాంగ మంత్రి తాజాగా ఈ విషయాన్ని వెళ్లడించారు… టిక్ టాక్ సహా మరికొన్ని చైనీస్ యాప్స్ అంశం పరిశీలనలో ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు…

కాగా కరోనా వ్యాప్తి విషయంలో డ్రాగన్ పై మండిపడుతున్నారు అమెరికా అద్యక్షుడు ట్రంప్… సరిహద్దుల వివాదంలో తాము భారత్ వైపేనని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు… ఈ నేపథ్యంలోనే చైనా యాప్స్ కు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది అగ్రరాజ్యం…