మరో ఘనత సాధించిన చైనా కేవలం ఆరు రోజుల్లో

మరో ఘనత సాధించిన చైనా కేవలం ఆరు రోజుల్లో

0
96

చైనాని కరోనా వైరస్ కన్నీటి సంద్రంలో నింపేసింది వేలాది మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంది, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.. నగరాలు నగరాలు ఖాళీ చేస్తున్నారు, అయితే కంపెనీలు బ్యాంకులు కాలేజీలు స్కూల్ ఐటీ సెక్టార్ ఇలా చాలా వరకూ నెలరోజులుగా తెరచుకోలేదు.

బయటకు రావడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు… మెడిసన్ కోసం ప్రయత్నిస్తున్న చైనాకి ముఖ్యంగా మాస్కుల బెడద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల పదంటే పది రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించి, తన శ్రామిక సత్తాను ప్రపంచానికి చాటిన చైనా, ఇప్పుడు మరో ఘనతను సాధించనుంది.

కేవలం ఆరు రోజుల్లోనే బీజింగ్ లో ఓ ఫ్యాక్టరీని నిర్మించాలని నిశ్చయించింది. అవును కోరావా వైరస్ ప్రభావం పెరగడంతో అక్కడ మాస్కులు వాడే వారి సంఖ్య పెరిగింది దీంతో మాస్కులకి ఇబ్బంది వచ్చింది అక్కడ సరైన స్టాక్ లేదు ..దీంతో రోజుకి 2.50 లక్షల మాస్క్ లు తయారు చేసేలా ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.24 గంటలు షిఫ్టులుగా నిర్మాణం చేస్తున్నారు. ఆదివారానికి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయనున్నారు.