బ్రేకింగ్ – అక్కడ తెరుచుకోనున్న సినిమా హల్స్ ? యజమానులు ఖుషీ

బ్రేకింగ్ - అక్కడ తెరుచుకోనున్న సినిమా హల్స్ ? యజమానులు ఖుషీ

0
91

ఈ వైరస్ లాక్ డౌన్ తో పూర్తిగా సినిమా పరిశ్రమ మూసుకుపోయింది, ఏకంగా నాలుగు నెలలుగా షూటింగులు లేవు మన దేశంలో పరిస్దితి ఇలా ఉంది, అయితే ఈ వైరస్ పుట్టిన చైనాలో కూడా ఇలాగే ఉంది పరిస్దితి. అక్కడ కూడా ఆరు నెలలుగా సినిమాలు లేవు షూటింగులు లేవు.

అక్కడ సినిమా హాల్స్ క్లోజ్ చేశారు.. తాజాగా ఇప్పుడు కేసులు సంఖ్య తగ్గడం, జనం తిరగడంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది…కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సినిమా హాళ్లను తెరిచేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది. జులై 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతించింది.

అయితే ఫుల్ గా జనం రావడానికిమాత్రం అనుమతి లేదు.. హాల్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మందిని మాత్రమే హాల్లోకి అనుమతించేందుకు నిర్ణయించింది…ప్రేక్షకుల మధ్య కొన్ని సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా యాజమాన్యాలకు సూచించింది. ఇక టికెట్స్ మాత్రం థియేటర్ దగ్గర ఇవ్వరు, అన్నీ ఆన్ లైన్ లో ఇస్తారు.. మాస్కు ధరించి సినిమాకి రావాలి అని కండిషన్స్ పెట్టారు.