చల్లటి కబురు- రుతుపవనాల పై దేశ ప్రజలకు గుడ్ న్యూస్

చల్లటి కబురు- రుతుపవనాల పై దేశ ప్రజలకు గుడ్ న్యూస్

0
92

మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు భానుడి భగ భగలు ఎలా ఉంటాయో తెలిసిందే.. అడుగు బయట పెడితే ఎండ వేడి ఎలా తగులుతుందో తెలిసిందే, అయితే జూన్ నెల వచ్చింది అంటే చాలు చల్లటి గాలులు నైరుతి రుతుపవనాలు పలకరిస్తాయి, అంతేకాదు చల్లటి గాలితో మన దేశాన్ని తాకి ఇక్కడ నేలపై తొలకరి కురుస్తాయి.

 

ముఖ్యంగా రైతులకి ఎంతో ఆనందకరమైన నెల జూన్ నెల, దేశంలోకి ఎంట్రీ ఇస్తాయి నైరుతి రుతుపవనాలు, మరి ఈ ఏడాది ఎప్పుడు వస్తాయి, అనుకున్న సమయానికి ఇవి మన దేశాన్ని తాకుతాయా అంటే గుడ్ న్యూస్..

నైరుతి రుతుపవనాల ఆగమనంపై భారత వాతావరణ శాఖ ఐఎండీ శుభవార్త చెప్పింది. సాధారణ రీతిలోనే జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది.

 

జూన్ 1న కేరళను తాకి, ఆపై దేశంలో ప్రవేశిస్తాయని తెలిపారు, ఇక వారం తర్వాత మిగిలిన స్టేట్స్ కు ఇక జూన్ నెలాఖరికి దేశం అంతా ఇవి విస్తరిస్తాయి అని అంటున్నారు… ఇప్పటికే మే నెలలో ఎండ వేడి ఎలా ఉందో చూస్తున్నాం, ఇది చల్లటి కబురు అనే చెప్పాలి.