చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వడానికి మేయిన్ కారణం ఇదే….

చంద్రబాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వడానికి మేయిన్ కారణం ఇదే....

0
97

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ… ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశ వ్యాప్తంగా చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ గత ఏడాది ముందూ వరకు కూడా అధికారంలో ఉంది… రాష్ట్ర ఆవిర్భవం తర్వాత ఏపీలో చంద్రబాబు సీఎం పీఠం అదిష్టించారు… ఈ క్రమంలో ఆయన దూకుడు రాజకీయాలు చేశారు…

అదే సమయంలో గతంలో పది సంవత్సరాలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీని మోసిన నాయకులకు విచ్చలవిడిగా స్వేచ్చను ఇచ్చేశారు… దీంతో పార్టీలో నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు… ఫలితంగా టీడీపీ పట్టుతప్పిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి… జిల్లాకో నాయకుడు తన ఇష్టానుసారం వ్యవహరించారు.. అంతేకాదు అధినేత ఆదేశాలను కూడా పట్టించుకోలేదు… ఇక ఎన్నికల సమయానికి పార్టీ పరిస్థితి ఎలా మారిందో తెలిసిందే…

బద్ద శత్రువు కాంగ్రెస్ తో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమీ కట్టారు… దీనిని పార్టీలోనే కొందరు జీర్ణించుకోలేక పోయారు… ఫలితంగా చంద్రబాబు వీక్ అయ్యారు… అదే సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం కూడా పార్టీలో ఆయన ఇమేజ్ ను సన్నగిల్లేలా చేసింది.. దీంతో చంద్రబాబు చెప్పింది వినడానికి కష్టపడిన నాయకులు వాటిన ఆచరణలో చెప్పేందుకు మాత్రం ఇష్టపడలేదు…

ఇక అర్హత లేకపోయినా తనయుడు లోకేశ్ బలవంతంగా రాజకీయ వారసత్వం కట్టబెట్టేందుకు ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయటం ఇటు రాష్ట్ర ప్రజలకే కాకుండా సొంత పార్టీ నేతలతకే నచ్చలేదు… ఇక ఎన్నికల సమయంలో ఏ జరిగందో అదరికీ తెలిసిందే… ఎన్నికల తర్వాత క్రమ క్రమంగా చంద్రబాబు నాయుడు హవా తగ్గుతూ వచ్చింది…