ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఒక పోస్ట్ ఇంకా ఖాళీగానే ఉంది… ఆ పోస్టే రాష్ట్ర తెలుగు యువత… గతంలో దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగు యువత బాధ్యతలను చేపట్టారు… అయితే ఇటీవలే ఆయన వైసీపీ తీర్ధం తీసుకోవడంతో ఇప్పుడు ఈ పోస్ట్ ఖాళీగా ఉంది…
అయితే కొన్ని రోజుల పాటు ఈ పోస్టుకు పరిటల శ్రీరామ్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.. కానీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది… మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది…
జిల్లాస్థాయి అధికార పార్టీ నేతలను సమర్దవంతంగా ఎదుర్కోవాలంటే పరిటాల శ్రీరామ్ స్థాయి సరిపోదని పవన్ కుమార్ రెడ్డిని ఆ పదవిలో నియమించగలిగితే అక్కడ అధికార నేతలను సమర్దవంతంగా ఎదుర్కోగల సత్తా జేసీ కుటుంబానికి ఉందని వార్తలు వస్తున్నాయి… ఈ కారణంతోనే పవన్ కు తెలుగు యువత బాధ్యతలను అప్పిగించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… కాగా గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు పవన్…