ఏపీ సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ ట్వీట్ చేశారు.
“సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి…. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి…. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ(YS Jagan)? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది… ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు… అభివృద్ది పాలన ఎవరిదో… విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం… నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా…. దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ” అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు(Chandrababu).