ఏపీ: వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం

Chandrababu flags on YCP government

0
88

వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతపై మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

“స్మగ్లర్లను పట్టుకోకుండా ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెడుతున్నారు. సామాన్యుడు ఇసుక కొనే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? రేషన్ కార్డులు దుర్మార్గంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నవన్నీ జగన్ బ్రాండ్లే… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మద్యం బ్రాండ్లకు పేర్లు పెట్టారు.

నా ఆవేదన పదవి కోసం కాదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఈ రాష్ట్రం ఏమవుతుందో, యువత భవిష్యత్ ఏమవుతుందో అని బాధగా ఉంది. ఈ పోరాటం పార్టీ కోసమో, నా కోసమో కాదు. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడం కోసమే మా పోరాటం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.