ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు… చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి పెద్ది రామచంద్రారెడ్డి మీద అలాగే ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు..
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆరోపించారు… ఇటీవలే బీ కొత్తకోటలో జరిగిన గొడవలలో ఇరు వర్గాలు టీడీపీకి చెందిన వాళ్లనని అన్నారు… కానీచంద్రబాబు నాయుడు అబద్దాల లేఖ రాశారని ఆరోపించారు.. చంద్రబాబు మరోసారి తప్పుడు లేఖలు రాయకుండా కేసు నమోదు చేయాలని అన్నారు..
మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచి విభేదాలే ఉన్నాయని అన్నారు.. ఎస్వీయూ ఎన్నికల్లో చంద్రబాబుకు పెద్దిరెడ్డి వ్యతిరేకంగా పని చేశారని అప్పటినుంచి పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు కోపమని అన్నారు…