టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా వచ్చి ప్రతీ అంశం మీద స్పందిస్తున్నారు.. అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన ఆన్ లైన్ లో మాట్లాడుతున్నారు, ఈ సమయంలో జూమ్ ని బాగా వాడుతున్నారు చంద్రబాబు, అయితే పార్టీ నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సమయంలో చంద్రబాబు ప్రెస్మీట్ సమయంలో ఆయన మనవడు దేవాన్ష్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగా.. దేవాన్ష్ సూపర్ అంటూ తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు.. బాబు జూమ్లో శుక్రవారం సాయంత్రం ప్రెస్మీట్ నిర్వహించారు.. అమరావతి అంశంపై స్పందించారు..
ఈ సమయంలో దేవాన్ష్ లైవ్ జరుగుతుంది అని తెలియక, అక్కడ పుస్తకాల కోసం వచ్చాడు, అది లైవ్ లో రికార్డ్ అయింది, అయినా ఏం మాట్లాడకుండా తనకు కావలసిన పుస్తకం తీసుకుని నెమ్మదిగా కింద నుంచి వెళ్లిపోయాడు, ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది, దేవాన్ష్ తీసుకున్న పుస్తకం అక్బర్ బీర్బల్ కథకు సంబంధించినదని చెబుతున్నారు. ఇలా మనవడు చేసిన పనికి ఆ క్రమశిక్షణ ఎంతో నచ్చింది అంటూ తెలుగు తమ్ముళ్లు మురిసిపోతున్నారు.