చంద్రబాబుకు బిగ్ షాక్… టీడీపీకి భూమా ఫ్యామిలీ గుడ్ బై…. జనసేనకు జైజై..

చంద్రబాబుకు బిగ్ షాక్... టీడీపీకి భూమా ఫ్యామిలీ గుడ్ బై.... జనసేనకు జైజై..

0
94

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అలాగే ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… 2009 ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న భూమా నాగిరెడ్డి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు…

ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి గెలిచారు… దాని తర్వాత కొన్ని అనివార్యకారణాలవల్ల భూమా కుటుంబం తిరిగి టీడీపీ తీర్ధం తీసుకుంది.. మంత్రి కూడా అయింది అఖిల ప్రియ.. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేయగా 30 వేల ఓట్లతో ఓటమిని చవిచూసింది అఖిల ప్రియ…

ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అఖిల ప్రియ ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరబోతున్నారంటు వార్తల వస్తున్నాయి… మరి ఆమె నిజంగా టీడీపీకి గుడ్ బై చెబుతున్నారా లేక ఎవరైనా కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారా అనేది ఆమె స్పందించేవరకు ఆగాల్సిందే… ఏది ఏమైనా ఇప్పుడు టీడీపీలో ఇదే హాట్ టాపిక్…