చంద్రబాబుకు డబుల్ షాక్ వైసీపీలోకి ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే…

చంద్రబాబుకు డబుల్ షాక్ వైసీపీలోకి ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే...

0
113

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… ప్రస్తుతం పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారట… ఈ క్రమంలో సందు దొరితే చాలు వైసీపీలోకి జంప్ చేయడానికి వేచి చూస్తున్నారట… వాస్తవానికి వీరందురూ ఎప్పుడో జంప్ చేయాలని చూశారు… కానీ వీరిని మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ఆపేసింది…

అయితే ఇప్పుడు అన్ని సర్దుకుంటుండంతో వైసీపీ తిరిగి ఆపరేషన్ ఆకర్షన్ ను మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి… ప్రధానంగా టీడీపీకి బలంగా ఉన్న నేతలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతానికి టీడీపీకి చెందిన ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..

వీరిద్దరు ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా ప్రచారం సాగుతోంది… పార్టీలో చేరే విషయమై వారు జిల్లాకు చెందిన మంత్రితో చర్చలు జరుపుతున్నారట… అన్ని కుదిరితే ఈ నెలలో మంచి ముహూర్తం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి…