చంద్రబాబుకు 5 రోజులు డెడ్ లైన్ విధించిన వైసీపీ సర్కార్…

చంద్రబాబుకు 5 రోజులు డెడ్ లైన్ విధించిన వైసీపీ సర్కార్...

0
104

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికార వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు… చంద్రబాబు నాయుడు రాజధాని ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారాణ కోరాలని సవాల్ విసిరారు… ఐదు రోజుల్లో చంద్రబాబు నాయుడు నుంచి సమాధానం రాకుంటే బాబు పాలనంతా అవినీతే అని ప్రజలు విశ్వసించాల్సి వస్తుందని అన్నారు..

ఐదేళ్ల టీడీపీ పాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి చేశారని ఆయన మండిపడ్డారు… అమరావతి పేరుతో అక్రమాలు పాల్పడ్డారని అన్నారు.. చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే వీటిపై సీబీఐ విచారణకు సిద్దం కావాలని సవాల్ విసిరారు..

ప్రస్తుతం అభివృద్ది, సంక్షే కార్యక్రమాలు కొనసాగుతుంటే చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయనకు తగిన గుణపాటం ప్రజలు చెబుతారని అన్నారు…