తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి పీక్ స్టేజ్ కు చేరుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సుమారు ఏడు సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో ఉన్న పార్టీ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని అంటున్నారు…
ఒక దశలో సీనియర్ నేతలు ఒక సందర్భంలో నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారట… ఈ క్రమంలో కొందరు ప్రస్తుతం అధ్యక్షుణ్ణి మార్చాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు…
కిందిస్థాయి నుంచి పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ కోర్ కమిటీ వరకు నాయకత్వాన్ని మార్చాలని వారు లేఖలో పేర్కొన్నారు… మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి… ఒక వేళ స్పందిచక పోతే పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంటుందని అంటున్నారు…