గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా… తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. గిడుగు రామ్మూర్తి వంటి ఎందరో మహానుభావులు తెలుగు భాషను సామాన్యులకు చేరువచేసేందుకు తమ జీవితాలను త్యాగం చేసారని అన్నారు..
కానీ ఈరోజు తెలుగును తెలుగువారి నుంచే దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది. కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తెలుగుతల్లిని కీర్తించుకోవడం నామోషీ అన్నట్టు ఉంది. తెలుగుభాషాభిమానులందరూ ఈ విపరీత ధోరణులను గర్హించాలి. మన తెలుగుభాషను కాపాడుకోవాలని అన్నారు..
అలాగే నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు… వాడుక భాషలో పుస్తకాలు రాయడానికి ఒక ఉద్యమమే చేసారు మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని అన్నారు… ఆ ఫలితంగానే ఈరోజు తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి అందింది.
అటువంటి తెలుగు భాషను రాష్ట్రంలో కనుమరుగు చేయాలని కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదామని అన్నారు.. ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు రామమూర్తిగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు