Chandrababu | పొత్తు కుదిరిన రోజే వైసీపీ ఓటమి ఖాయమైంది: చంద్రబాబు 

-

టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ “‘రాష్ట్ర భవిష్యత్‌ కోసమే జనసేనతో ఈ కలయిక. ఐదు కోట్ల ప్రజల కోసం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చాం. రాష్ట్ర చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజు. రాష్ట్ర విభజన తర్వాత కంటే వైకాపా పాలనలోనే ఎక్కువ నష్టం జరిగింది. బ్రాండ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నాశనం చేశారు. జగన్‌ పాలనలో సామాన్యులు, నేతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ను వైజాగ్‌లో ర్యాలీ చేస్తే అడ్డుకున్నారు. పొత్తు కుదిరిన రోజే మా విజయం ఖరారైంది. ఆ రోజే వైసీపీ కాడి వదిలేసింది” అన్నారు.

- Advertisement -

“అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రూపాల్లో కోటి మంది అభిప్రాయం తీసుకున్నాం. ప్రజల మధ్యన ఉండే.. ప్రజలు కోరుకున్న వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నాం. తొలి విడతలో భాగంగా మొత్తం 118 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం. యువత, మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్నవారూ ఉన్నారు. టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. ఇరు పార్టీల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇక పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ “ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం. 98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు ముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది” అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...