చంద్రబాబు అదే విషయం లో వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారు ..

చంద్రబాబు అదే విషయం లో వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారు ..

0
74

జగన్ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో లోపాలు వెతకడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన టీడీపీ ఇప్పుడు కొత్తగా మూడు రాజధానుల విషయం లో వైసీపీ ని టార్గెట్ చేసింది .ఒక వైపు రాజధాని నిర్ణయం లో కేంద్రం జోక్యం ఉండదని తెలిసిన కూడా బాబు కేంద్రం పై ఒత్తిడి తీసుకొని రావడం ఒక అర్థం లేని విషయంగా కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .

అయినా అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు గుర్తురాని కేంద్రం అనుమతి ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ కొందరు నేతలు బాబుపై విమర్శలు చేస్తున్నారు . భూ సేకరణ జరగకుండానే రైతులకు 2 లక్షల కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలని అయన తెచ్చిన ప్రతిపాదనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది . చంద్రబాబు చెప్పిన భూ సమీకరణాల్లో ఎలాంటి వాస్తవాలు లేవని వైసీపీ స్పష్టం చేసింది .

రాష్ట్ర ప్రజల్లో మూడు రాజధానుల విషయం లో ఎక్కడా రాణి వ్యతిరేకత టీడీపీ నేతల్లో మాత్రమే రావటం ,వైసీపీ ని ఎదో విధంగా విమర్శించాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని కొందరు నేతలు చెబుతున్నారు . టీడీపీ పన్నుతున్న వ్యూహాలకి వైసీపీ బయపడదని కొందరు వైసీపీ నేతలు అంటున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి .