మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… స్వాతంత్య్ర సమర వీరులలో విప్లవాగ్ని రగిలేది కాదని తెలిపారు… అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నారు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారని అన్నారు..
అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలని అన్నారు… అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలని అన్నారు…
అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుందని తెలిపారు.. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ తెలుగు వీర కిశోరం స్మృతికి నివాళులు అర్పించానని అన్నారు…