చంద్రబాబును ఇబ్బంది పెడుతున్న విషయం అదొక్కటే….

చంద్రబాబును ఇబ్బంది పెడుతున్న విషయం అదొక్కటే....

0
106

రాజకీయ పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి.. ఒక పక్క ప్రతిక్ష పార్టీలు అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను టార్గెట్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తూ ప్రభుత్వానికి షాక్ ఇస్తుంటే మరోపక్క అధికార పార్టీ టీడీపీ హయాంలో జరిగి కుంభకోణాలను బయట తీయడానికి శతవిధాలా ప్రవర్తిస్తోంది… ప్రస్తుతం రాజధాని అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగంగా చేసిన సర్కార్ ఇప్పుడు తాజాగా చంద్రన్న కానుక రంజాన్ తోఫా ఫైబర్ నెట్ సెటాప్ బాక్స్ ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని సుమారు ఫైబర్ నెట్ లోనే 700 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని నిర్దారించి ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే…

ఊహించని ఈ నిర్ణయం టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది… తాజాగా ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కావాడం మరో 24 గంటల వ్యవధిలోనే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులనుకలవరపాటుకు గురి చేస్తోంది..ఫైబర్ గ్రిడ్ కేసు లోకేశ్ మెడకు చుట్టుకునే దాక రావచ్చన్న సంకేతాలు అందుతున్నాయి ఆ భయంతోనే అధికార వైసీపీ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతుందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది…

ముఖ్యంగా ఫైబర్ గ్రిడ్ కేసు టీడీపీ నేతలే చాలా మంది జగన్ జైలు జీవితాన్నిపదే పదే ప్రసావిస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ హయాంలో జరిగిన అవినీతి నిరూపించిటీడీపీ నేతలను జైలుకు పంపించే వరకు వైసీపీ సర్కార్ నిద్రపోయేలా లేదనే భావన తాజా పరిణామాల నేపథ్యంలో వ్యక్తమవుతోంది… టీడీపీ తరపున కొంతమంది తమ గళాన్ని వినిపిస్తున్నారు… ఇక సర్కార్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలతో ముందు ముందుపార్టీలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేని పరిస్ధితి ఏదేమైనా టీడీపీ నేతలు అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైంది… ఎన్నికలు ఇంకా నాలుగేళ్లు సుదీర్ఘ వ్యవధి ఉండటంతో అప్పటివరకు పార్టీని ఉన్న నాయకులను కాపాడుకోవడం అధినేత చంద్రబాబుకు కత్తిమీద సామేనని అంటున్నారు…