చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు

0
105

వచ్చే ఒలంపిక్స్ అమరావతిలోనేనని చెప్పారని…. ప్రపంచంలో ఎక్కడా మొదలే కాని హైపర్ లూప్ రవాణా వ్యవస్థ సిద్ధమవుతోందని చిటికెలేసారని చంద్రబాబుబు నాయుడు ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు…

ఇంటింటికి పైపులైన్ల ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేస్తామని అసాధ్యమైన కామెడీ వదిలారని మండిపడ్డారు. ఈ గిమ్మిక్కులన్నీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచడం కోసం కాక మరేమిటి విజయసాయి రెడ్డి ప్రశ్నించారు… అలాగే ఇటీవలే చంద్రబాబు నాయుడు అమరావతి యాత్రలో అడ్డంగా దొరికిపోయారని అన్నారు.

అందరికీ టిఫిన్లు పెట్టారా అని నిర్వాహకుడిని అడిగితే డబ్బులిచ్చాం అని బదులిచ్చాని తెలిపారు. అంతా పెయిడ్ ఆర్టిస్టులయ్యారని బాబు అనడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు…. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయిందని తెలిపారు. బతుకంతా డబ్బుతో మ్యానేజ్ చేయడమే అని ఆరోపించారు