లోకేశ్ కోసం చంద్రబాబు భారీ ప్లాన్…

లోకేశ్ కోసం చంద్రబాబు భారీ ప్లాన్...

0
134

చంద్రబాబు నాయుడు వారసుడు ఎవరు ఇది తెలుగుదేశం పార్టీలో ఎడతెగని చర్చ ఇంకా చెప్పాలంటే ఇతర పార్టీలలో కూడా అదే చర్చ ఓ విధంగా టీడీపీ ఇప్పుడు నాయకత్వ బలహీనతోనే కొట్టుమిట్టాడుతోంది… దాన్ని అసరాగా చేసుకుని సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారు చంద్రబాబుకు ఎటూ వయసు అయిపోయింది.. ఇక ఫ్యూచర్ లీడర్లు లేరు…

దీంతో ఏపీని మొత్తం దున్నేయ వచ్చని సీఎం జగన్ భారీ ఆశలతో వైసీపీ మొత్తం పరుగులు పెట్టిస్తున్నారు అయితే జగన్ అనుకున్నట్లుగా టీడీపీ కోలాప్స్ అయిపోలేదని పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించి మరిన్ని దశాబ్దాల బతికించే సత్తా తమ నాయకుడికి ఉందని తమ్ముళ్లు అంటున్నారు… చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేశ్ అని అంత అప్పట్లో అనుకున్నదే…

అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో పాటు ఏకంగా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిని మూట గట్టుకోవడంతో ఆయన మీద ఒక్కసారిగా ఫోకస్ తగ్గిపోయింది… లోకేశ్ నాయకుడు ఏంటీ అంటూ టీడీపీలోనే పెద్ద ఎత్తున చర్చ వచ్చింది… సీనియర్ నేతలందరు చంద్రబాబే మా నాయకుడు ఆ తర్వాత ఏం జరుగుతోంది మాకు తెలియదని తప్పించుకుంటున్నారు…అంటే లోకేష్ ను ఎవ్వరు భావి నాయకుడుగా గుర్తించలేదన్నమాట…

అందుకే చంద్రబాబు నాయుడు గట్టి సిగ్నల్ ఒకటి పంపించారు… టీడీపీలో ఉన్న యువ నాయకులతో లోకేష్ సమావేశం అయ్యారు… వారందరూ లోకేశ్ మాటమీదనే ఈ సమావేశానికి హాజరు అయ్యారు…సీనియర్ నాయకులు లోకేశ్ పట్టించుకోకపోయినా యువ నాయకులు లోకేశ్ వెంట ఉండే స్కెచ్ వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఎవరు కాదన్నా అవునన్నా తన తర్వాత లోకేశే పార్టీ అధ్యక్షుడని చంద్రబాబు చెప్పదలచుకున్నారట…