ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం హరికృష్ణ: చంద్రబాబు 

-

దివంగత టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. “నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను” అని బాబు ట్వీట్ చేశారు.

- Advertisement -

ఇక మామయ్య హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. “మా హ‌రి మావ‌య్య‌! నిబ‌ద్ధ‌త‌కు నిలువెత్తు రూపం. దూకుడు ఆయ‌న నైజం, కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వ‌తం. మేన‌ల్లుడిగా ఆయ‌న ఆత్మీయ‌త పొంద‌డం నా అదృష్టం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా చేప‌ట్టిన ప‌ద‌వుల‌కే వ‌న్నె తెచ్చిన నంద‌మూరి హ‌రికృష్ణ గారు లేని లోటు ఎవరు తీర్చ‌లేనిది. హ‌రి మావ‌య్య‌ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.

టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా, మాజీ మంత్రిగా హరికృష్ణ సేవలందించిన సంగతి తెలిసిందే. 2018 ఆగస్టు 29న హైదరాబాద్ నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారును హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. కారు అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఆయన వెనక్కి తిరగడంతో కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...