శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలపై జరుగుతున్న అక్రమాలపై స్పందించారు… ఈక్రమంలో పెళ్ళిళ్ల మ్యాటర్ ను మరోసారి ప్రస్తావించారు….
అద్యక్షా … పెద్ద పెద్ద నాయకులు ఒకరు సరిపోరని ఇద్దరు… ఇద్దరు సరిపోరని ముగ్గురు… ముగ్గురు సరిపోరని నలుగురు పెళ్లాలు కావాలనే తాపత్రాయ పడుతున్నారని పవన్ ఉద్దేశిస్తూ పరోక్షంగా జగన్ విమర్శలు… దీనిపై చంద్రబాబు స్పందించారు…
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్ ఇతరన భార్యల గురించి పెళ్ళిళ్ల గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు… అసెంబ్లీలో ఇలా మాట్లాడటం తాను మొదటి సారి చూస్తున్నానని అన్నారు… వైసీపీ నాయకులు చేత కాని పరిపాలనను కప్పిపుచ్చుకోవడానకి ఇలా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు…. వైసీపీ నాయకుల తప్పులు ఉన్నాయని వాటిని తాము కూడా అనగలమని అన్నారు…