ఫ్లాష్ న్యూస్- టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్స్..

Chandrababu sensational comments ..

0
99

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజున స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఏంటి? అని ప్రశ్నించారు. దీపావళి రోజున నిర్వహిస్తున్నట్లే.. క్రిస్ట్‌మస్ రోజున ఎన్నికలు నిర్వహిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రాన్ని పిచ్చోళ్ళ రాష్ట్రంగా చేస్తారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. నామినేషన్ వేసే అభ్యర్థులను అధికార పార్టీకి చెందిన వారు బెదిరిస్తున్నారని, అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఆర్వోలు డ్రామాలు ఆడితే.. జైలుకు వెళతారని, ఎక్కడున్నా కోలుకోలేని దెబ్బ తీస్తామని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమకే తెలియకుండా పోలీస్ కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. అలాగే రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసులు నిర్వీర్యం అయ్యిందని వ్యాఖ్యానించారు. జగన్‌తో జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా కావొద్దంటూ అధికారులను హెచ్చరించారు చంద్రబాబు.