పరిటాల ఫ్యామిలీకి బిగ్ షాక్ లు ఇస్తున్న చంద్రబాబు…

పరిటాల ఫ్యామిలీకి బిగ్ షాక్ లు ఇస్తున్న చంద్రబాబు...

0
103

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ కొనసాగుతోంది… ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ, జిల్లా అధ్యక్షులను ఎంపిక చేశారు.. అయితే ముఖ్యమై నేతలో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చంద్రబాబు నాయుడు అత్యధికంగా ప్రధాన్యత ఇచ్చారనే వాదన ఉంది… అయితే జిల్లాల వారిగా చూస్తే కొన్ని దశబ్దాలుగా పార్టీలో ఉన్న కొందరిని ఈ పదవులకు ఎంపిక చేయకపోవండపై అసంతృప్తి అదే రేంజ్ లో ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

ముఖ్యంగా అనంతపురం జిల్లా తీసుకుంటే ఇక్కడ పరిటాల ఫ్యామిలీ ఎప్పటినుంచో టీడీపీకి అండగా ఉంటోంది… 2019 ఎన్నికల్లో ఈ కుటుంబం రెండు టికెట్లు అడిగితే కేవలం ఒక టికెట్ మత్రమే ఇచ్చింది… ఆ సీటును కూడా కోల్పోయింది పరిటాల ఫ్యామిలీ… ఆ ఎన్నికల్లో తొలిసారి పరిటాల వరసుడు శ్రీరామ్ పోటీ చేసి ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.. ఇక పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో చంద్రబాబు నాయుడు పరిటాల ఫ్యామిలీని పట్టించుకోలేదనే వార్తలు వచ్చాయి…

ఇప్పుడు పార్లమెంటరీ జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు కనుక మాజీ మంత్రి పరిటాల సునీత తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అనుకున్నారు.. కానీ ఆ కుటుంబానికి చంద్రబాబు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు.. దీంతో ఈ పరిటాల అభిమానులు గుర్రున ఉన్నారట… పార్టీకోసం ఎన్నో కోల్పోయిన పరిటాల ఫ్యామిని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టడం ఏంటని అనుచరులు మండిపడుతున్నారు..