చంద్రబాబు సొంతజిల్లాలో సైకిల్ కు రిపేర్లు…

చంద్రబాబు సొంతజిల్లాలో సైకిల్ కు రిపేర్లు...

0
88

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారు అయిందా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు చెందిన అందరు నేతలు అధికారాన్ని ఎంజాయి చేసిన నేతలు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి…

ప్రస్తుతం నేతలంతా ముఖం చాటేస్తున్నారు…పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నాని కూడా సైలెంట్ అయ్యారు.. 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలు అయ్యారు.. ఇది ఆయన్ను బాగా కుంగదీసిందట… దీంతో సుమారు ఏడాది కాలంపాటు నాని పార్ట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు… పార్టీ నేతల ఇళ్లల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు మాత్రమే హాజరు అవుతున్నారు…

ఒక దశలో ఆయన పదవి వదులుకోవడానికి కూడా సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి.. జిల్లా అధ్యక్షుడే ఇలా ఉంటే ఇక పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని మరికొందరు అంటున్నారు.. మరి చూడాలి చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో…