చంద్రబాబు పవన్ కి బర్త్ డే విషెష్ చెప్పడం పై ఇద్దరు హీరో ల ఫ్యాన్స్ ఫైర్

చంద్రబాబు పవన్ కి బర్త్ డే విషెష్ చెప్పడం పై ఇద్దరు హీరో ల ఫ్యాన్స్ ఫైర్

0
91

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు . ఆయనకి భగవతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు . దీనిపై కొందరు నందమూరి అభిమానులు . ఈ చంద్రబాబుకి ఇండస్ట్రీ లోని అందరి హీరో ల బర్త్ డే లు గుర్తుంటాయి కానీ మా ఎన్టీఆర్ బర్త్ డే మాత్రం గుర్తుండదు అంటూ ట్వీట్లు చేసారు . మే నెలలో జరిగిన ఎన్టీఆర్ బర్త్ డే రోజున బాబు బాగా బిజీ అంటూ కామెంట్లు చేసారు . ఎన్టీఆర్ పై చంద్రబాబు కు ఎందుకంత వివక్ష అంటూ ట్విట్టర్ లో రెచ్చిపోయారు .

ఇదిలా ఉంటె ఇటు పవన్ అభిమానుల నుండి కూడా వ్యతిరేకభావమే వచ్చింది . మీ శుభాకాంక్షలు మా నాయకుడికి అవససరం లేదు మమ్మల్ని వదిలిపెట్టు అంటూ రీ ట్వీట్ చేసారు . పవన్ తో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్న ఆలోచనతోనే చంద్రబాబు ఇలా అప్పుడప్పుడు సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు .