చంద్రబాబుకి వంశీ సవాల్ నీ కొడుక్కి నీకు దమ్ముందా

చంద్రబాబుకి వంశీ సవాల్ నీ కొడుక్కి నీకు దమ్ముందా

0
92

తెలుగుదేశం పార్టీ గురించి రోజుకో సంచలనం క్రియేట్ చేస్తున్నారు వంశీ… అయితే నారా లోకేష్ తనని చాలా కించపరుస్తున్నాడు. నాపై తప్పుడు వార్తలు వెబ్ సైట్ ద్వారా రాయిస్తున్నాడు. నా క్యారెక్టర్ తగ్గించేలా చేస్తున్నాడు, నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బఫూన్లతో లోకేష్ ఉంటాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో రాజకీయం చేస్తున్నాడు. లోకేష్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, నా గురించి ఫైర్ అయ్యే సీన్ లోకేష్ కు లేదు అని విమర్శించారు వంశీ.

లోకేష్ విషయాలు అన్నీ నాకు తెలుసు అని అంటున్నారు ఆయన , నేను పార్టీలో లేకపోతే నష్టం లేదు అంటున్నాడు. మరి ఇంకెందుకు విమర్శలు చేస్తున్నాడు, 23 మంది మత్రమే గెలిచారు అంటే పరిస్దితి తెలుస్తుంది, నా గురించి మాట్లాడే అంత సీన్ లేదు లోకేష్ కి, అతను దద్దమ్మ పప్పు అంటూ విమర్శలు చేశారు వంశీ, ఎన్టీఆర్ అంటే లోకేష్ కు భయం పార్టీలోకి వస్తే మాత్రం లోకేష్ కు కష్టమే, ఇక పార్టీలోకి ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీలో వీరు ఉండరు. నేను చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా,బాబు దగ్గర జురాసిక్ పార్క్ ఉంది.. అందులో అనేక జంతువులు ఉన్నాయి.. హోటల్స్ ఉన్నాయి అందులో బజ్జీలు ఇడ్లీలు ఉన్నాయి ఇవన్నీ యానిమల్స్, నా పై చంద్రబాబు ఉసిగొల్పుతున్నాడు, మనిషి పుట్టుక పుడితే నా ఆస్తుల డిస్పూట్స్ ఉంటే నిరూపించండి అని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు వంశీ.. మీ చానల్ లో తప్పుడు వార్తలు రాయించి నా పై తప్పుడు వార్తలు రాయిస్తున్నావు అని విమర్శించారు వంశీ.