చంద్రబాబుతో కలవడమే తాము చేసిన తప్పు…

చంద్రబాబుతో కలవడమే తాము చేసిన తప్పు...

0
102

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనను నిరుత్సాహ పరిచిందని చెప్పింది డీకే అరుణ… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం కానీ అలాగే టికెట్స్ ఇచ్చిన విషయంలో కూడా తనను నిరుత్సాహ పరిచాయని ఆరోపించింది…

అండర్ స్టాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ లాగా నడిచిందని మండిపడింది డీకే అరుణ… ఆ ఎన్నికల్లో గెలిచేవాళ్లను పక్కన పెట్టి ఓడిపోయే వాళ్లకు అధిష్టానం టికెట్స్ ఇచ్చిందని ఆరోపించింది…

తెలంగాణ చిన్న స్టేట్ అని ఎవరికి ఇస్తే గెలుస్తారో ఎవరికి టికెట్ ఇస్తే ఓడిపోతారో అన్ని తెలిసి కూడా టికెట్స్ ఇచ్చారని ఆరోపించింది…అందుకే అక్కడ ఉండి సాధించేది ఏది లేదని తెలిసి తాను బీజేపీలో చేరానని తెలిపింది… వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు…