చంద్రునిపై వింత జీవులు. ఏమిటవి ?

చంద్రునిపై వింత జీవులు. ఏమిటవి ?

0
93

చంద్రగ్రహంపై వేలాది వింత జీవులు ఉన్నాయన్న కొత్త విషయం బయటపడింది. ‘ టార్టి గ్రేడ్స్ ‘ గా పిలుస్తున్న వీటిని ‘ వాటర్ బేర్స్ ‘ (నీటి ఎలుగులు) గా కూడా వ్యవహరిస్తున్నారు. అత్యంత దుర్భరమైన వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించే ‘ సత్తా ‘ వీటికి ఉందట. ఆహారం గానీ, నీరు గానీ లేకుండానే ఎంతోకాలం బతకగలవని, హాఠాత్తుగా తమ కణజాలాన్ని గట్టి గ్లాసు టైపులో మార్చుకోగలవని రీసెర్చర్లు చెబుతున్నారు. గత ఏప్రిల్ లో ఇజ్రాయెల్ తన ‘ బెరెషీట్ ‘ మిషన్ ని చంద్రునిపైకి ప్రయోగించింది. ఆ ప్రయోగం విఫలమైనప్పటికీ.. ఈ జీవులు మాత్రం ఎలాగో చంద్ర ఉపగ్రహం మీదికి చేరాయట. అతి సూక్ష్మమైన వీటి జాడను పరిశోధకులు కనుగొని ఆశ్చర్యపోయారు. ఇవి చాలాకాలం పాటు జీవం చచ్చిన స్థితిలో ఉన్నట్టు కనిపిస్తాయని, కానీ అంతమాత్రాన చనిపోవని అంటున్నారు. ఎనిమిది కాళ్ళు, ఒక్కో కాలికి ఎలుగుబంటి కాలికి ఉన్నట్టే చిన్నసైజు పంజా కూడా ఉంటుందని తేల్చారు. రేడియేషన్ ని కూడా తట్టుకోగల ఈ వాటర్ బేర్స్ శరీర నిర్మాణం వారిని షాక్ కి గురి చేసింది. అతిశీతలమైన, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనే కాదు.. లోతైన సముద్ర జలాల్లో కూడా జీవించగలిగే ఈ జీవుల విశేషాలు ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు.

దాదాపు 200 సంవత్సరాల వరకు ఈ సూక్ష్మ జీవులు బతకగలవని కీటక నిపుణులు చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ తన బెరెషీట్ మిషన్ లో వీటిని ఎలా చేర్చగలిగిందన్నది మిస్టరీగా ఉంది. తన ‘ స్పేస్ రీసెర్చ్ లైబ్రరీ ‘ నుంచి వీటిని ఆ దేశం సేకరించి ఉండవచ్ఛునన్నది ఒక అంచనా. పీ హెచ్ డీ గ్రాడ్యుయేట్ ఒకరు మైక్రోస్కోప్ లో ఈ వింత జీవి చలనాల తాలూకు వీడియో తీసి వదిలాడు.

సుష్మ మృతి పై ఇవాంకా దిగ్భ్రాంతి సుష్మ స్వరాజ్‌ మఅతి పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ స్పందించారు. గురువారం ఇవాంకా ట్వీట్‌ చేస్తూ.. సుష్మ మరణంగా తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. సుష్మ స్వరాజ్‌ ను విజేతగా అభివర్ణించిన ఇవాంకా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆమె ఓ స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. అలాంటి వ్యక్తితో పరిచయం ఉండడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వఅత్తి పట్ల ఎంతో అంకితభావం ఉన్న నేతను భారత్‌ కోల్పోయిందని విచారాన్ని వ్యక్తం చేస్తూ… ఇవాంకా ట్వీట్‌ చేశారు.