తెలంగాణ: హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఎఫెక్ట్ రాష్ట్ర ఇంటర్ బోర్డు పరీక్షలపై పడింది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30వ తేదీన ఉన్న నేపథ్యంలో..ఇంటర్ పరీక్షల తేదీలను మార్చేసింది ఇంటర్ బోర్డ్. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్ చేసింది. దీనితో 29న జరగాల్సిన పరీక్ష 31వ తేదీకి..30న జరగాల్సిన పరీక్ష నవంబర్ 1వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. మారిన షెడ్యూల్ తో విద్యార్థులు అలర్ట్ కావాలని ఇంటర్ బోర్డు సూచించింది.
Flash: విద్యార్థులకు అలర్ట్- తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు
Changes in Telangana Inter Exam dates