చీరాల వైసీపీలో చలరేగిన వాగ్వివాదం…

చీరాల వైసీపీలో చలరేగిన వాగ్వివాదం...

0
77

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది… మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వర్ధంతి నేడు… రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహానికి పార్టీ నేతలు పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు… ప్రకాశం జిల్లా చీరాలలో కూడా వైఎస్ విగ్రహం వద్ద పార్టీ నేతలు శ్రద్దాంజలి తెలిపే క్రమంలో నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది…

మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీల మధ్య అలాగే ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.. అయితే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి సర్దుమనిగింది… బలరాం ఆమంచి వర్గీయులు పోటాపోటీగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు… దీంతో ఏదో జరగబోతోందని ముందే ఊహించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు…

దీంతో పోలీసులు బలరాం వర్గీయులకు ఉదయం అవకాశం ఇవ్వగా ఆతర్వాత ఆమంచి వర్గీయులకు అవకాశం ఇచ్చారు… ఈ కార్యక్రమం జరుగుతుండగానే ఆయంచి వర్గీయులు కరణం వర్గీయులు కలబడ్డారు దీంతో పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి సర్దుమనిగింది…