ఈ గుడిలో చికెన్, మటన్ బిర్యానీలు ప్రసాదాలు – ఎక్కడంటే

-

ఒక్కో దేవాలయంలో ఒక్కో ఆచారం ఒక్కో సంప్రదాయం ఉంటాయి, అయితే కొన్ని దేవాలయాల్లో ఇలాంటి ప్రసాదాలు పెడతారా అని ఆశ్చర్యపోతారు కొందరు… నిజంగా ఇప్పుడు చెప్పబోయే దేవాలయం కూడా అలాంటిదే, ఇక్కడ ప్రసాదం ఏమిటో తెలుసా, కోడి కూర మటన్ , బిర్యానీలు, మరి ఈ ప్రసాదాలు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ఆ స్టోరీ చూద్దాం.

- Advertisement -

తమిళనాడులోని మధురైలో ఉండే మునియాండి స్వామి దేవాలయంలో చికెన్, మటన్ బిర్యానీలు ప్రసాదంగా పంచుతారు. ఇలా ఎన్నో ఏళ్లుగా నాన్ వెజ్ ప్రసాదాలు పెడుతుంటారు. ప్రతీ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో ఈ బిర్యానీ ప్రసాదం ఉంటుంది. ఈ ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారు, ఇది తింటే తమ పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

ఈ ప్రసాదం తయారీకి 1000 కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను వినియోగిస్తారు. గుడికి వచ్చే భక్తుల పట్ల ఏ మాత్రం వివక్ష చూపకుండా వాళ్లు తిన్నంత బిర్యానీ పెడతారు…. అంతే కాదు ఈ బిర్యానీని పార్శిల్ కూడా తీసుకునే వీలుంది. 84 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇంకా వందేళ్లు అయినా ఈ సంప్రదాయం కొనసాగిస్తాం అంటున్నారు ఇక్కడ ఆలయ అధికారులు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...