ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్యకు ప్రసవం

Childbirth for a collector's wife at a government hospital

0
120

తెలంగాణ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సతీమణి మాధవి గర్భిణీ కావడంతో తొలి కాన్పు కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలలో చేరడం జరిగింది. ఎమర్జెన్సీగా గర్భిణీకి ఆపరేషన్ అవసరం అవడంతో ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్టు లు సూరపనేని.శ్రీక్రాంతి, డాక్టర్ భార్గవి, అనస్థీషియా వైద్య నిపుణులు దేవికల ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయడంతో తో మగ శిశువుకు జన్మనిచ్చింది.

ఆపరేషన్ అనంతరం శిశువును ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి శిశువుకు పరీక్షించి వైద్యాన్ని అందజేశారు. ఒక జిల్లా కలెక్టర్ సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్డెంట్ ముక్కంటి వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణా, ఇతర ప్రభుత్వ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ దురిశెట్టి 2017 లో జ‌రిగిన సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జమ్ లో దేశంలోనే మొదటి ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు.