చైనాకు మరో డేంజర్ న్యూస్ చెప్పిన నిపుణులు

చైనాకు మరో డేంజర్ న్యూస్ చెప్పిన నిపుణులు

0
78

చైనాలో ఈ కరోనా వైరస్ పుట్టింది అనేది తెలిసిందే… ఏకంగా 70 రోజులు లాక్ డౌన్ లో ఉంది ఆ దేశం, చైనా లో80 వేల కేసులు నమోదు అయ్యాయి, కాని ఇప్పుడు పూర్తిగా చైనా కోలుకుంది ..అక్కడ సాధారణంగా అన్నీ వ్యవస్ధలు నడుస్తున్నాయి.. కాని గత వారం నుంచి మళ్లీ పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి, దీంతో ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుని కట్టడి చేస్తున్నారు అధికారులు.

వైరస్ సోకిన వారిని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు, చైనాకు చెందిన వైద్య, ఆరోగ్య నిపుణులు కరోనా నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనీయుల్లో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువని, దాంతో కరోనా వైరస్ మరోసారి విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు, అయితే ఇప్పుడు వైరస్ వచ్చిన తర్వాత చాలా మంది ఈ భయంతో ఇమ్యునిటీ పవర్ పెరిగే ఆహరం తీసుకుంటున్నారట.

కొన్ని చోట్ల కేసులు మళ్లీ వస్తున్నాయి అని, అక్కడ వైద్యులు కూడా చెబుతున్నారు, తాజాగా వుహాన్ నగరంలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అక్కడ ప్రబుత్వం మాత్రం ఈసారి గతంలో వచ్చిన కేసుల్లా విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అంటోంది.