కరోనా వైరస్ చైనాలో పుట్టింది అత్యంత దారుణంగా ఈ వైరస్ అక్కడ నుంచి ప్రపంచానికి పాకేసింది. ఇప్పుడు 13 లక్షల మందికి ఈ వైరస్ సోకింది, ఇక ఈ వైరస్ మహమ్మారికి 30 వేల మంది పైగా మరణించారు, ఇక చైనాలో ఈవైరస్ వ్యాప్తి కాస్త తగ్గడంతో ఇప్పుడు అక్కడ సాధారణంగా అందరూ బయటకు వస్తున్నారు… రెండు రోజుల క్రితం వుహన్ లో అందరూ బయటకు వచ్చారు. ఆఫీసులు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి.
ట్రైన్లు నడుస్తున్నాయి, ఈ సమయంలో మరో దారుణమైన వార్త చైనాని వణికించింది.చైనాలో రెండవ విడత కరోనా వైరస్ సోకుతుండటంతో చైనా వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా చైనా దేశంలో కొత్తగా 63 కేసులు వెలుగుచూశాయి.
అంతేకాదు ఈ కొత్త కేసుల్లో ఏకంగా ఇద్దరు మరణించారు వారు చిన్న వయసు వారు అని తెలుస్తోంది,ఇప్పటి వరకూ చైనా చెప్పేదాని ప్రకారం 82000 మందికి వైరస్ సోకిందట, ఇక 3300 మంది మరణించారు అని చెబుతోంది. అయితే మరోసారి ఈ వైరస్ ప్రబలుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టాలి అని కోరుతున్నారు అక్కడ వైద్యులు.