చైనాలోని వుహాన్ లో మ‌రో దారుణం

చైనాలోని వుహాన్ లో మ‌రో దారుణం

0
104

క‌రోనా మ‌హ‌మ్మారికి ప్ర‌పంచం వ‌ణికిపోతోంది, ఈ వైర‌స్ కు పుట్టినిల్లు వుహాన్ అనే చెబుతారు, అత్యంత దారుణ‌మైన స్దితికి ఇప్పుడు ప్ర‌పంచం ఉంది అంటే ఆ క‌రోనా వ‌ల్లే అని చెప్పాలి, అయితే ఇప్పుడు చైనాలో క‌రోనా ప్ర‌భావం త‌గ్గింది, పాజిటీవ్ కేసుల సంఖ్య బాగా త‌గ్గింది, ల‌క్ష‌ల మంది బాధ‌ప‌డిన వుహ‌న్ ఇప్పుడు కోలుకుంటోంది.

అక్క‌డ రోడ్ల‌పైకి జ‌నాలు ఇప్పుడిప్పుడే వ‌స్తున్నారు. పాజిటీవ్ కేసులు మొత్తం త‌గ్గిపోయాయి, దీంతో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. దాదాపు వందరోజులకు పైగా లాక్ డౌన్ లో ఉక్కిరిబిక్కిరి అయిన అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాల వారు ఒక్కసారిగా బయటికి రావడంతో తీవ్ర కోలాహలం ఏర్పడింది.

అయితే ఇక్క‌డ జియాంగ్ షీ ప్రావిన్స్ కు వేలాది మంది వెళ్లేందుకు నేడు సిద్ద‌మ‌య్యారు, త‌మ వారిని క‌లుసుకోవాలి అని ఆత్రుత‌తో వేలాది మంది అక్క‌డ‌కు చేరుకుందామ‌ని వెళ్లారు, చివ‌ర‌కు స‌రిహ‌ద్దు ప్రాంతానికి వెళ్లిన‌ స‌మ‌యంలో అక్క‌డ వారిని పోలీసులు అడ్డుకున్నారు, ఇంత మందిని లోప‌లికి పంపం అని ఆపేశారు .. దీంతో పోలీసులపైన దాడి చేయడమే కాకుండా, వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు.