చైనాలో వుహ‌న్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా త‌ప్ప‌కుండా చ‌ద‌వండి

చైనాలో వుహ‌న్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా త‌ప్ప‌కుండా చ‌ద‌వండి

0
90

చైనాలో పుట్టిన ఈ వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది, దాదాపు 34 ల‌క్షల మందికి సోకింది ఈ వైర‌స్, అయితే ఇంత దారుణంగా ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌డంతో, అమెరికా అత‌లాకుత‌లం అయింది… ఇక్క‌డ 11 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి, అయితే చైనాలో మాత్రం రెండు నెల‌ల లాక్ డౌన్ త‌ర్వాత కాస్త ఇప్పుడు ప‌రిస్దితి స‌ర్దుమ‌ణిగింది, ఇప్పుడు అక్క‌డ కే‌సులు ఏమీ లేవు.

అయితే గ‌త ప‌ది రోజుల క్రితం కేసులు పెరుగుతున్నాయి అని అనుకున్నారు, కాని ఎక్క‌డిక‌క్క‌డ మ‌రోసారి క‌ట్ట‌డి చేయ‌డంతో కేసుల సంఖ్య త‌గ్గిపోయింది, ఇప్పుడు చైనాలో రోజూ ఒక్క కే‌సు కూడా న‌మోదు అవ్వ‌లేదు.

తాజాగా చైనాలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 1 మాత్రమే. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్ హెచ్ సీ) వెల్లడించింది. అయితే అది అక్క‌డ వారికి కాదు, విదేశాల నుంచి చైనా వ‌చ్చిన వ్య‌క్తికి వైర‌స్ సోకింది అని తెలిపింది చైనా, ఇక్క‌డ చైనాలో నేటి వ‌ర‌కూ 82,875 కేసులు నమోదు కాగా, 77,685 మంది కోలుకున్నారు. 4,633 మరణాలు సంభవించాయి. ఇప్పుడు వుహ‌న్ లో ఒక్క కేసు కూడా లేదు అని తెలిపింది అక్క‌డ ప్ర‌భుత్వం.