చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అత్యంత దారుణమైన స్దితికి తీసుకువచ్చింది.. అమెరికా ఇటలీ అత్యంత దారుణమైన స్దితికి చేరుకున్నాయి, అమెరికా ఆర్దిక వ్యవస్ద అలాగే ఇటలీ ఆర్దిక వ్యవస్ధ దారుణంగా మారింది.
అయితే ఇక్కడ జనాలు చెప్పేది కొత్తగా ఉంది, అంతేకాదు ఇక్కడ వార్త పత్రికలు మీడియాలు చెప్పేది వేరుగా ఉంది, సుమారు వుహన్ లోనే వేలాది మంది చనిపోయారని అంటున్నారు.. చైనాలో మొత్తం 81 వేల మందికి పైగా కరోనా సోకగా, కేవలం 3,300 మంది మరణించారని అధికారికంగా వెల్లడిస్తోంది.
జనవరి 23వ తేదీ తర్వాత మార్చి 25 మధ్య కాలంలో వూహాన్ నగరం మొత్తాన్ని నిర్బంధించారు. పురుగు కూడా కదలకుండా కట్టుదిట్టం చేశారు. దీంతో చాలా మంది ఇంటిలోనే మరణించారు, తర్వాత వారికి సంబంధించిన దహన కార్యక్రమాలు పూర్తి చేసి వారి అస్తికలు కుటుంబ సభ్యులకి అందించారట..మొత్తం ఏడు దహనవాటికలు నిర్విరామంగా పనిచేశాయి.
ప్రతి రోజు దాదాపు 3500 అస్థికల కుండలను స్మశాన వాటికల నుంచి ఆయా కుటుంబాలకు అందించినట్టు స్థానికులు చెబుతున్నారు అంటే దీని ప్రకారం కచ్చితంగా లెక్కవేస్తే దాదాపు 40 నుంచి 50 వేల మరణాలు సంభవించాయని స్ధానికులు చెబుతున్నారు.